మహబూబాబాద్ లోని తాళ్ల పూసపెల్లి రోడ్డులో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కంకర రవాణా చేస్తున్న టిప్పర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని అంబులెన్స్ లో జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.