మహబూబాబాద్ బస్ డిపో నుంచి నవంబర్ 16న టీజీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో పంచారామాలు యాత్ర టూర్ ప్యాకేజీని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ కళ్యాణి తెలిపారు. 16న రాత్రి 11 గంటలకు 40 సీట్ల డీలక్స్ బస్సు పంచారామాలకు (అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట) బయలుదేరి 18న తిరిగి మహబూబాబాద్ చేరుకుంటుంది. పెద్దలకు రూ. 1700, పిల్లలకు రూ. 900 చార్జీగా నిర్ణయించారు. మరిన్ని వివరాలకు 7396210102, 9948214022 నంబర్లలో సంప్రదించవచ్చు.