విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైల్ కు ఆదివారం పెను ప్రమాదం తప్పింది. మహబూబాబాద్ జిల్లా తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో అప్ లైన్లో 428/11 వద్ద ఎద్దును వందే భారత్ రైలు ఢీకొంది. ఎద్దును ఢీకొనడంతో కొన్ని నిమిషాల పాటు రైలు నిలిచింది. రైలు ఇంజిన్ ముందుభాగం డ్యామేజ్ అయింది. స్పందించిన రైల్వే సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎద్దు కళేబరాన్ని పక్కకు తొలగించారు.