మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మీడియా సమావేశం నిర్వహించారు. సీతక్కపై మండిపడి “నీకు ఏమైనా తిక్కా? ఆ శాపనార్థాలు, దొంగ ఏడుపులు ఏమిటి?” అని ప్రశ్నించారు. నీవు సోషల్ మీడియా స్టార్ తప్ప అభివృద్ధికి పనికిరాని మంత్రివి అని విమర్శించారు. ములుగు అభివృద్ధి మేమే చేశామని, నువ్వేం చేశావని ప్రశ్నించారు. ఫోటోల మోజు మానుకొని అభివృద్ధిపై దృష్టిపెట్టాలని సూచించారు.
Ask ChatGPT