మహబూబాబాద్: పెళ్లి ఒత్తిడితో యువతి ఆత్మహత్య

మేడిపలి పోలీస్ స్టేషన్ పరిధిలో పెళ్లి ఒత్తిడి తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన బకృతట మమత (18), మేడ్చల్ జిల్లా మేడిపలిలో కుటుంబంతో కలిసి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తల్లిదండ్రులు ఆమెకు వివాహం నిశ్చయించగా, మమత ఉన్నత చదువులు కొనసాగిస్తానని తెలిపింది. ఇష్టం లేకున్నా పెళ్లికి ఒప్పుకున్న ఆమె, ఏప్రిల్ 23న స్నానానికి వెళ్లి ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించగా, ఏప్రిల్ 27 తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందింది. ఎవరిపైనా అనుమానం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్