మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల విద్యాధికారి రవీందర్, అయోధ్య పురం జిల్లా పరిషత్ హై స్కూల్ అసిస్టెంట్ చంద్రమౌళిలు రూ. 15,000 లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. గుండెంగ గ్రామ శివారు వాగ్య తండా ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు రవీందర్ పదవీ విరమణ ఫైళ్లపై సంతకాల కోసం నెల రోజులపాటు రూ. 15,000 లంచం అడిగి వేధించినట్లు బాధితుడు తెలిపారు. జిల్లా పరిషత్ హై స్కూల్ అయోధ్య పురం హెడ్మాస్టర్ గూడూరు మండల విద్యాధికారిగా ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు.