మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన రైతులు తమ తొమ్మిదేళ్లుగా పరిష్కారం కాని భూ సమస్యపై మహబూబాబాద్ జాయింట్ కలెక్టర్‌ను శుక్రవారం కలిశారు. దాదాపు 1800 ఎకరాల భూమిని ఎంజాయ్‌మెంట్ సర్వే చేయగా, కొన్ని సర్వే నంబర్లు భూ భారతి రికార్డుల్లో నమోదయ్యాయి. అయితే, 117 సర్వే నంబర్లలోని 142 ఎకరాల భూమి, 126 మంది రైతుల పేర్లను రికార్డుల్లో నమోదు చేయడం లేదని, ఈ సమస్యను పరిష్కరించి, తమ భూములను రికార్డుల్లో చేర్చాలని రైతులు జేసీని కోరారు.