నెల్లికుదురు: విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని కాసియా తండా గ్రామపంచాయతీ పరిధిలోని ధర్మగడ్డకు చెందిన బానోతు సురేష్ అనే యువకుడు విద్యుత్ షాక్ తో మృతి చెందినట్లు ఎస్ఐ రమేష్ బాబు తెలిపారు. రాత్రి అన్న, బావమరిదితో కలిసి స్లాబ్ పై నిద్రిస్తుండగా వర్షం రావడంతో ఇనుప మంచాన్ని కదిలించే క్రమంలో దారిలో ఉన్న కరెంట్ వైర్ తగలడంతో షాక్ కు గురై మృతి చెందినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై మృతుడి భార్య యమున ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్