హెల్మెట్ ధరించనిదే గ్రామంలోకి నో ఎంట్రీ !

మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం వెంకట్రాంపురం గ్రామస్థులు, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించకుండా తమ గ్రామంలోకి రావొద్దని మంగళవారం గ్రామశివారులో బ్యానర్‌ ఏర్పాటు చేశారు. వారం క్రితం పోలీసులు గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించి, వాహన ప్రమాదాలు, హెల్మెట్‌ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. దీని స్ఫూర్తితో పంచాయతీ పాలకవర్గం, గ్రామంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణించేవారు తప్పక హెల్మెట్‌ ధరించాలని తీర్మానించింది.

సంబంధిత పోస్ట్