పెద్దవంగర మండలంలోని అవుతాపురం గ్రామంలో కొద్దిరోజుల క్రితం వేముల ఝాన్సీ, వేముల లక్ష్మయ్యలు మరణించారు. శుక్రవారం వారి కుటుంబాలను పెద్దవంగర మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తోటకూరి రాధిక శ్రీనివాస్ పరామర్శించి ఒక్కొక్కరికి 50 కేజీల బియ్యం చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ కుటుంబాలకు ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.