మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రచయితల వేదిక ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ మూడవ తెలుగు మహాసభల పోస్టర్‌ను డిపిఆర్ఓ పసునూరి రాజేంద్రప్రసాద్ ఆవిష్కరించారు. జనవరి 2026, 3 నుండి 5 వరకు గుంటూరు జిల్లా అమరావతిలో జరిగే ఈ మహాసభలకు మహబూబాబాద్ జిల్లా నుండి 150 మంది కవులు, కళాకారులు వెళ్లనున్నారు. కవులకు, కళాకారులకు ఉమ్మడి వరంగల్ జిల్లా నిలయమని, అంతరించిపోతున్న కళలకు జీవం పోయడం, వారిని ఆదరించడం గొప్ప విషయమని రాజేంద్రప్రసాద్ అన్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పే కళాకారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.