పల్స్ పోలియో విజయవంతం: మహబూబాబాద్ డీఎంహెచ్వో

మహబుబాబాద్ జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని మహబూబాబాద్ డీఎంహెచోవో డా. రవి రాథోడ్ తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 469 పోలియో కేంద్రాల ద్వారా 76, 660 మంది లక్ష్య చిన్నారుల్లో 73, 570 మందికి పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఇంటింటి ప్రచారంలో 938 బృందాలు రెండు రోజుల్లో 1, 91, 108 ఇళ్లను సందర్శించి 3, 785 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసి 101 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్