వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా, యాసంగిలో వరి సాగుకు బదులుగా పప్పు ధాన్యాల పంటలు సాగు చేయాలని ఆత్మ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా, మహబూబాబాద్ ప్రాంతంలోని రైతులకు సూచించారు. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు పొందడానికి ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అవసరమైతే ఏఈఓలను సంప్రదించాలని ఆయన శనివారం తెలిపారు.