మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాలు, 3వ రైల్వే లైన్ నిర్మాణం, ప్లాట్ ఫారం నిర్మాణ పనులను శుక్రవారం డిఆర్ఎం గోపాలకృష్ణన్ పరిశీలించారు. డిఆర్ఎం గోపాలకృష్ణన్ ను కలిసి మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో 4వ రైల్వే ప్లాట్ ఫారం నిర్మాణం, పలు రైళ్ళు నిలుపుదల, మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యే మురళీ నాయక్, బిజేపీ, బీఆర్ఎస్, ముస్లిం మైనార్టీ నేతలు విన్నవించారు.