మహబూబాబాద్: ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో కొన్ని నిబంధనలు తొలగించాలని వినతి

మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పోకు సోమవారం సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి అజయ్ సారధి పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. అయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో చిన్న చిన్న నిబంధనలను తొలగించాలని వినతిపత్రంలో కోరారు. కొన్ని నిబంధనల వల్ల అర్హులైన పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అధికారులు స్పందించి నిబంధనలు తొలగించాలని విన్నవించారు.

సంబంధిత పోస్ట్