సంక్రాంతి రద్దీ.. బస్టాండ్లలో ప్రయాణికుల కష్టాలు

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించడంతో పిల్లలతో పాటు సొంత ఊళ్లకు వెళ్లేవారి సంఖ్య పెరిగింది. అయితే, పండుగ రద్దీకి తగినన్ని బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్‌లో వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్