ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి మధు పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం తొర్రూర్ బస్ స్టాండ్ నుంచి ఆర్డివో ఆఫీసు వరకు 400 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డివో గణేష్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. తొరూర్ డివిజన్‌లో ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కరించమని డిమాండ్ చేశారు.