మహబూబాబాద్ జిల్లాలో ఉపాధి హామీ యాప్‌లో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. గుండు చేయించుకున్న కార్మికుడి ముఖాన్ని NMMS యాప్ గుర్తించకపోవడంతో అటెండెన్స్ నమోదు కాలేదు. ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఇటీవల కొండగట్టు అంజన్నకు తలనీలాలు సమర్పించాడు. అనంతరం ఉపాధి హామీ పనులకు వెళ్లి ఫేస్ స్కాన్ చేయించగా, గుండుతో ఉండటంతో యాప్ అతన్ని గుర్తించలేదు. దీంతో పక్కనే ఉన్న మహిళా కూలీ తన జుట్టుతో అతని తలను కప్పగా, వెంటనే యాప్ ఫోటోను అంగీకరించి అటెండెన్స్ నమోదు చేసింది. ఈ ఘటనతో ఉపాధి హామీ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోపాలు మరోసారి బయటపడ్డాయి.