పదవ తరగతి ఫలితాల్లో మండల టాపర్‌గా తేజస్విని

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గురుకుల పాఠశాల విద్యార్థిని టి. తేజస్విని పదవ తరగతి పరీక్షల్లో 568 మార్కులు సాధించి, మండలంలోనే మొదటి స్థానంలో నిలిచారు. ఈ విజయం ద్వారా ఆమె తన పాఠశాలకు, తల్లిదండ్రులకు గర్వకారణమయ్యారు. TTWURJC(G)పాఠశాల ప్రిన్సిపల్ కల్పన తేజస్వినిని అభినందిస్తూ, ఆమె భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్