రోడ్డు ప్రమాదంలో బాలిక స్పాట్ డెడ్

మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రోడ్డు దాటుతున్న బాలికను కారు ఢీకొట్టగా ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. వేగంగా వెళ్తున్న ఆ కారు అదుపు కాకపోవడంతో పార్కింగ్ చేసి ఉన్న ఓ బైకును ఢీకొట్టింది. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే రోడ్డుపై బైఠాయించి ప్రమాదానికి కారణమైన కార్ డ్రైవర్ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్