కోతుల బెడదతో విసిగిపోయిన సర్పంచ్.. కొండముచ్చు వేషంతో తరిమికొట్టారు!

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగు గ్రామ శివారులోని జగ్గు తండాలో కోతుల బెడద తీవ్రంగా మారింది. దీనికి వినూత్న పరిష్కారంగా, గ్రామ నూతన సర్పంచ్ హనుమాన్ కొండముచ్చు వేషధారణ ధరించి కోతులను తరిమికొట్టారు. గ్రామ ప్రజల సమస్యను గుర్తించి, పరిష్కరించిన సర్పంచ్‌కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్