తొర్రూరు మున్సిపల్ పరిధిలోని 2వ వార్డుకు చెందిన కురుమ ముఖేష్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. ఆదివారం 2వ వార్డు మాజీ కౌన్సిలర్ తూనం రోజా ప్రభుదాస్, కాంగ్రెస్ నాయకులు తూనం శ్రావణ్ కుమార్ సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులకు రూ. 10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక సేవలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు.