తొర్రూరు మండలంలోని వెలికట్ట గ్రామానికి చెందిన శ్రీలక్ష్మి టెంట్ హౌస్ నిర్వాహకులు దీకొండ శ్రీనివాస్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు రూ. 20 వేలు విలువచేసే సీసీ కెమెరాలను శుక్రవారం తొర్రూరు ఎంఈఓ మహంకాళి బుచ్చయ్య, పాఠశాల హెచ్ఎం శ్రీను బాబులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవడం స్థానికుల బాధ్యతని, పాఠశాలకు అగంతకులు ఎవరు వచ్చినా సీసీ కెమెరాలు దోహదపడతాయని గుర్తు చేశారు.