మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బిరిశెట్టిగూడెంలో శనివారం రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. వీటిలో ఒకటి గ్రానైట్ లారీ కావడంతో, ఎదురుగా ఢీకొన్న మరో లారీ రోడ్డు పక్కకు పడిపోయింది. పడిపోయిన లారీని తీసేందుకు భారీ క్రేన్‌ను తెప్పించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పోలీసులు ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకున్నారు.