కంటైనర్ లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి

మంగళవారం బయ్యారం మండలంలోని సంతులాల్ పోడు తండా వద్ద ఇల్లందు–మహబూబాబాద్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 82 ఏళ్ల గోగినేని బాబురావు మృతి చెందారు. గార్ల మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన ఆయనను కంటైనర్ లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్