మహబూబాబాద్ మున్సిపల్ పాలకవర్గం పదవీకాలం ముగిసి ఏడునెలలు గడుస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రజలు ఎన్నో సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు. త్రాగునీటి కొరత, పరిశుభ్రతలేని పరిస్థితులు ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. ఎన్నుకున్న కౌన్సిలర్లు ఉంటే తమ సమస్యలు నేరుగా చెప్పుకునే అవకాశం ఉండేదని మానుకోట వాసులు అంటున్నారు.