తొర్రూరు డివిజన్ తెలంగాణ మాల జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామానికి చెందిన వీడియో జర్నలిస్ట్ చదల యాకాంతం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని జిల్లా అధ్యక్షుడు చంద శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బేతమల్ల సహదేవ్ బుధవారం తెలిపారు. నియామకానికి సహకరించిన నేతలకు యాకాంతం కృతజ్ఞతలు తెలిపారు.