2027 మేడారం జాతర తేదీలు ఖరారు

​ములుగు జిల్లా మేడారంలో జరిగే శ్రీ సమ్మక్క-సారలమ్మ మహా జాతర తేదీలను పూజారుల (వడ్డేల) సంఘం ప్రకటించింది. 2027 ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు నాలుగు రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రికి రాసిన లేఖలో తెలిపింది. ఈ నాలుగు రోజుల పాటు శ్రీ సమ్మక్క-సారలమ్మ అమ్మవార్ల ఉత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతాయని పూజారుల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు, కార్యదర్శి చందా గోపాల్ రావు మరియు ఇతర సభ్యులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕