శుక్రవారం రాత్రి 6 గంటల నుంచి శనివారం ఉదయం 3.30 గంటల వరకు మేడారం జాతరలో పస్ర నుంచి తాడ్వాయి వరకు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ పరిస్థితి జాతర చరిత్రలో ఎన్నడూ చూడలేదని, డబుల్ రోడ్డుపై కూడా వాహనాలు కదలని దుస్థితి నెలకొందని భక్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ నియంత్రణకు యంగ్ ఐపీఎస్ అధికారులను ఎక్కడ నియమించారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.