మేడారంలో ఘనంగా తిరుగువారం వారం జాతర

ములుగు జిల్లా మేడారంలో బుధవారం తిరుగువారం జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు ఐదు లక్షల మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. పూజారులు, అధికారులతో కలిసి మంత్రి సీతక్క గద్దెలను దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేపట్టామని మంత్రి సీతక్క తెలిపారు. మహాజాతరకు ఇప్పటివరకు రెండు కోట్ల మందికిపైగా భక్తులు వచ్చారని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్