మంగళవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపెల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పోడు భూముల్లో గుంతలు తవ్వడానికి వెళ్లిన ఫారెస్ట్ అధికారులను, జేసీబీ వాహనాన్ని పోడు రైతులు అడ్డుకున్నారు. దీంతో ఫారెస్ట్ అధికారులకు, పోడు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆదివాసీలను అటవీ శాఖ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆరోపించారు.