ములుగు నియోజకవర్గంలోని గంగారాం మండలంలో మండల మాజీ అధ్యక్షుడు ఈర్ప సూరయ్య సమక్షంలో శ్రీరామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా నాయకుడు బాడీశ నాగరమేష్ గురువారం వివిధ గ్రామాల్లోని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం నాగరమేష్ మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలకు అండగా నిలిచి, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.