ములుగు మండలం బండారుపల్లిలోని పీఎంశ్రీ మోడల్ పాఠశాల విద్యార్థులు పర్యావరణ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి బహుమతులు గెలుచుకున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాసం, పాటలు, పోస్టర్ పెయింటింగ్ పోటీల్లో వీరు విజయం సాధించారు. విజేతలకు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు బహుమతులు అందజేశారు. ఈ విషయాన్ని ప్రిన్సిపల్ సింగారపు దేవకి తెలిపారు.