గోదావరి వరద ఉధృతిపై అప్రమత్తంగా ఉండాలి

గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఏటూరునాగారం సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్ బాబు బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఓడగూడం వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించారు. గోదావరి నీటిమట్టం 14. 18 మీటర్లకు చేరుకుందని, త్వరలో మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి 14. 83 మీటర్లకు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండి ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రజలు నది వైపు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పిల్లలు, పశువుల విషయంలో ప్రత్యేక అప్రమత్తత అవసరమని ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕