మేడారంలో 10 వేల మంది భక్తులు సేదతీరేలా భవనాలు

ములుగు జిల్లా మేడారంలో జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మంత్రి సీతక్క శుక్రవారం తెలిపారు. క్యూలైన్ల వద్ద రెండు భారీ భవనాలు నిర్మిస్తున్నారు. ఒక్కో భవనంలో 10వేల మంది సేద తీరవచ్చు. ఎండ, చలి నుంచి ఉపశమనం పొందేందుకు, కుటుంబ సభ్యులు, వృద్ధులు, వికలాంగులు విశ్రాంతి తీసుకునేందుకు జాతరలోపు ఈ భవనాలు పూర్తవుతాయని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్