ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం కలెక్టర్ దివాకర టిఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రానికి జ్వరంతో వచ్చిన ప్రతి వ్యక్తికి మలేరియా, డెంగ్యూ రక్తపరీక్షలను నిర్వహించి మెరుగైన వైద్యాన్ని అందించాలని పస్రా పీహెచ్సీ వైద్యాధికారిణి సుహానను ఆదేశించారు.