ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దంపతులు, పి.సి.సి. చీఫ్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దంపతులు వన దేవతలను దర్శించుకున్నారు. ఆదివాసీ సాంప్రదాయ కళాకారుల నృత్య ప్రదర్శనతో మంత్రి సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వారికి స్వాగతం పలికారు. అనంతరం, శ్రీ సమ్మక్క, సారలమ్మలకు నిలువెత్తు బంగారంతో మొక్కులు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు.