తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రి వర్గ సహచరులతో కలిసి ఆదివారం మేడారం వెళ్తున్నారు. అక్కడ జరుగుతున్న జాతర ఏర్పాట్ల పనులను పరిశీలించి, లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టేలా అధికారులకు పలు సూచనలు జారీ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.