ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలో గురువారం ఉదయం 11 గంటలకు ఎమ్మార్పీఎస్–ఎంఎస్పి నూతన మండల కమిటీల ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎంఎస్పి జిల్లా కార్యదర్శి కాడపాక శ్యామ్ మాదిగ తెలిపారు. ఈ ఎన్నికలకు రాష్ట్ర ఉపాధ్యక్షుడు చాతల రమేష్ మాదిగ, జాతీయ నాయకుడు నెమలి నరసయ్య మాదిగ, జిల్లా అధ్యక్షుడు పుల్లూరి కరుణాకర్ మాదిగతో పాటు పలువురు నాయకులు హాజరుకానున్నారు. మండలంలోని ఎమ్మార్పీఎస్–ఎంఎస్పి నాయకులు, విద్యార్థులు, కార్యకర్తలు, రక్తబంధువులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.