ములుగు జిల్లాలో పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఏటూరునాగారం జడ్పీహెచ్ఎస్ విద్యార్థిని కృష్ణ అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లా ప్రథమ స్థానం సాధించింది. ఆమె 600 మార్కులకు గాను 589 మార్కులు సాధించి, అన్ని సబ్జెక్టుల్లో A1 గ్రేడ్లు పొందడం విశేషం. ఈ విజయంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు.