ములుగు జిల్లా తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో ఆదివారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఏటూరునాగారంలో వడగళ్ల వాన పడింది. ప్రయాణికులు బస్టాండ్ ఆవరణలో ప్రధాన రహదారుల గుండ పారిన వర్షపు నీరుతో ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షంతో ఉష్ణోగ్రతలు తగ్గి ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం.
అకాల వర్షాలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.