ఏటూరునాగారం: ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి ..సర్పంచ్

ములుగు జిల్లా ఏటూరునాగారంలో ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సర్పంచ్ శ్రీలత సూచించారు. శనివారం ఆమె ఇంకుడు గుంతల కోసం సిద్ధం చేసిన సిమెంట్ రింగులను పరిశీలించి నాణ్యతను తనిఖీ చేశారు. మురుగునీటి నిల్వ వల్ల దోమల వ్యాప్తి పెరిగి రోగాలు వస్తున్నాయని, కాబట్టి ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత ఏర్పాటు చేయాలని ప్రజలకు తెలిపారు. తాగునీటి సమస్యలుంటే వెంటనే తెలియజేయాలని, పాడైన పంపులను త్వరగా మరమ్మతు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్