ములుగు జిల్లా ఏటూరునాగారం లో తమ సమస్యలు పరిష్కరించాలని ఆదివాసీ గిరిజన సంఘం అధ్వర్యంలో సోమవారం ఐటిడిఏ కార్యాలయం ముట్టడికి ఎంపీడీఓ కార్యాలయం నుండి ఐటీడీఎ వరకు భారీ ర్యాలీ గా తరలివచ్చారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులపై ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలని కోరారు. పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేసింది.