సమాజంలోని పౌరులుగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం అలవాటు చేసుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం గోవిందరావుపేట మండలంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంత్రి మొక్కలు నాటారు. కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ మల్లాడి రామ్ రెడ్డి, ఎఫ్ఎఓ రమేష్, ఎఫ్తార్ అబ్దుల్ రహమాన్, తదితరులు పాల్గొన్నారు.