ములుగు జిల్లా ఏటూరునాగారం పట్టణంలో సుమారు రూ. కోటితో నిర్మిస్తున్న ఆధునిక కూరగాయల మార్కెట్ పనులను ఆదివారం మంత్రి సీతక్క పరిశీలించారు. నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులకు ఆదేశించారు. ఈ మార్కెట్ నిర్మాణం చుట్టుపక్కల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ రేగ కల్యాణి, ఇతర నాయకులు పాల్గొన్నారు.