ములుగు జిల్లా ఏటూరునాగారంలో 40 రోజులుగా తమ వడ్లు కొనడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోతలు పూర్తి చేసి కొనుగోలు కేంద్రాలకు తరలించి బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్నామని, కాంటాలు కాక ఎండలో, వర్షం ఎప్పుడు పడుతుందో తెలియక కాపలా కాస్తున్నామని వాపోయారు. సన్నాలు పెడితే రూ. 500 బోనస్ ఇస్తామని ఆశ చూపి ఇప్పుడు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.