మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో రైతులు ఆవేదన

ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏఐకేఎఫ్ నాయకులు శనివారం  పరిశీలించారు. కొనుగోలు కేంద్రం ప్రారంభమై 20 రోజులు గడిచినా ఒక్క లారీ కూడా రాకపోవడం, గన్ని బ్యాగుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.2400 అందక, రైతులు దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోందని రాష్ట్ర కోశాధికారి గుండెబోయిన చంద్రయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే రైతులు ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్