గోవిందరావుపేట మండలం ప్రాజెక్ట్ నగర్ గ్రామంలో మొన్న కురిసిన భారీ వర్షానికి నష్టపోయిన 10 కుటుంబాలకు ఎంపీపీ సుడి శ్రీనివాస్ రెడ్డి, గోవిందరావుపేట ఎమ్మార్వో అల్లం రాజ్ కుమార్ చేతుల మీదుగా శుక్రవారం ఎమ్మార్వో ఆఫీస్ కార్యాలయంలో ప్రభుత్వం నుండి ఒక్కొక్కరికి మంజూరైన 10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఎంపీపీ మాట్లాడుతూ నష్టపోయిన 10 కుటుంబాలకు అన్ని విధాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నివేళలా అండగా ఉంటుందన్నారు.