గ్రాడ్యుయేట్ ఓటర్లపై దృష్టి సారించండి: బడే నాగజ్యోతి

మంగపేట మండల కేంద్రంలో BRS ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా BRS ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ బడే నాగజ్యోతి మాట్లాడుతూ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుపై కార్యకర్తలు దృష్టి సారించాలని సూచించారు. మంగపేట-ఏటూరునాగారం రహదారుల దుస్థితి, ఇసుక లారీల రాకపోకలతో రోడ్లు దెబ్బతినడం, హాస్టళ్లు, విద్య, మౌలిక వసతుల సమస్యలపై ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులకు 24 గంటల విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం BRS పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕