ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. శనివారం ఉదయం వరకు మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ప్రవహించిన గోదావరి సాయంత్రం నుంచి తగ్గుముఖం పట్టినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆదివారం రాత్రి 9 గంటలకు 11. 38 మీటర్ల మేర గోదావరి నీటిమట్టం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.